విశ్వాసం రెండో షెడ్యూల్ 

విశ్వాసం రెండో షెడ్యూల్ 

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం విశ్వాసం. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొద్దీ రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిపిన చిత్రబృందం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది. ఇక తాజాగా ఇవాల్టి నుండి రెండో షెడ్యూల్ ను జరుపుకోవడానికి ప్లాన్ చేసుకుంది. 

అజిత్ ఈ సినిమాలో గ్రామీణ వ్యక్తిగా తెల్ల జుట్టు, పంచె కట్టుతో కనిపించనున్నారు. గతంలో అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబర్చిన నేపథ్యంలో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మొదటగా ఈ చిత్రాన్ని దీపావళీకి రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలవ్వడంతో సంక్రాంతికి వాయిదా పడింది. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్  నిర్మితమవుతున్న ఈ సినిమాకి డి ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.