వీడియో: ఆకాష్ అంబానీ వెడ్డింగ్ కార్డు

వీడియో: ఆకాష్ అంబానీ వెడ్డింగ్ కార్డు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9న జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్  వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి వేడుక‌కు ఆహ్వానిస్తూ అంబానీ దంప‌తులు ఓ వెరైటీ వివాహ కార్డును త‌యారు చేశారు. ఈ వివాహ కార్డు ధర 2.3 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ పెళ్లి కార్డును మొదటగా ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం పాదాలపై పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

పెళ్లి కార్డు బాక్సులో ఉండగా.. లోపల, బయటా రాధాకృష్ణుల ఫొటోలు ఉన్నాయి. బాక్సును ఓపెన్ చేస్తే.. రాధాకృష్ణుల‌ సిల్వ‌ర్ ఫోటో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇక ఇన్న‌ర్ కంపార్ట్‌మెంట్‌ను తెరిస్తే వివాహ కార్డు క‌నిపిస్తుంది. ఈ వివాహ కార్డు చూసిన వారు అందరూ వావ్ అంటున్నారు. ప్రస్తుతం వివాహ కార్డుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. మరి ఆలస్యం ఎందుకు మీరు చూడండి.