పాపం ఈ 19 ఏళ్ల హీరోయిన్ కు ఎన్ని కష్టాలు..!!

పాపం ఈ 19 ఏళ్ల హీరోయిన్ కు ఎన్ని కష్టాలు..!!

టాలీవుడ్లో నటించిన ఆ నటి మొదటి సినిమా భారీ పరాజయం పాలైంది.  దీంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.  తమిళంలో జయం వన మగన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమా పర్వాలేదు అనిపించింది.  బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ శివమ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. పక్కా యాక్షన్ సినిమా కావడంతో ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.  సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాలీవుడ్ లో ఆమె ఎంట్రీ పాజిటివ్ గానే జరిగింది.  ఇంతకీ ఆ నటి ఎవరు అని అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు సయోషా సైగల్.  ఒకనాటి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు ఈమె.  

టాలీవుడ్, బాలీవుడ్ కంటే సాయేషా కోలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి సారించింది.  ఆమె నటించిన మూడు సినిమాలు ఇటీవలే రిలీజ్ అయ్యాయి.  ఇందులో ఒకటి కార్తీ హీరోగా నటించిన కడైకుట్టి సింగం కాగా, రెండోది విజయ్ సేతుపతి "జుంగా" సినిమా, మూడోది గజినీకాంత్.  ఈ మూడు సినిమాల్లో కడైకుట్టి సినిమా మంచి విజయం సాధించింది.  గజినీకాంత్ పర్వాలేదు అనిపించినా.. జుంగా మాత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  కడైకుట్టి సింగం తప్ప మిగతా రెండు ఆశించిన విజయం సాధించలేకపోవడంతో.. సాయేషా కెరీర్ డైలమాలో పడింది.  అయితే, ఈ అమ్మడు మాత్రం తన శక్తివంచన లేకుండా నటించానని, విజయం, పరాజయంతో తనకు సంబంధం లేదని అంటోంది.  ప్రస్తుతం సూర్యతో సూర్య 37 సినిమాలో నటిస్తున్నది.  ఈ సినిమా హిట్టైతే ఈ అమ్మడి కెరీర్ తిరిగి గాడిలో పడ్డట్టే.