సంక్రాంతి శుభాకాంక్షలతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ '

సంక్రాంతి శుభాకాంక్షలతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ '

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ ను అందుకోలేకపోయాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో  'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. ఈ చిత్రంలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తే అఖిల్, పూజాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని మరో సారి అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. గీతా ఆర్ట్స్-2 బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వాసు వ‌ర్మ కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గోపిసుంద‌ర్ సంగీత స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్టు లేని అఖిల్ ప్ర‌స్తుతం ఈ సినిమాపైనే చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.