దూసుకెళ్తున్న అక్కినేని యువ హీరో..

దూసుకెళ్తున్న అక్కినేని యువ హీరో..

తెలుగు హీరోలందరూ తమతమ సినిమాల విషయంలో శరవేగంతో దూసుకెళ్తున్నారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ల దగ్గర నుంచి సత్యదేవ్, నవీన్ పోలిసెట్టి వంటి చిన్న హీరోలందరూ కూడా చకచకా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా చేస్తూనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా ప్రతి హీరో రెండు మూడు సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి అక్కినేని చిన్నోడు కూడా చేరాడు. అఖిల్ కూడా తన జోరు పెంచాడు. సినిమాల పరంగా కాస్త వెనుకబడి ఉన్న అఖిల్ వరుస సినిమాలు ఓకే చేస్తూ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కనిపింనున్న అఖిల్ ఈ సినిమా చేస్తూనే సురేందర్ రెడ్డితో మరో సినిమాకు ఓకే చెప్పాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సురేందర్ రెడ్డి రూపొందించనున్న స్పైథ్రిల్లర్ సినిమా పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పుడు అఖిల్ తాజాగా మరో సినిమాకి పచ్చ జెండా ఊపాడట. ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ ఎన్ డీకేలతో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడట. అంతేకాకుండా పాన్ ఇండియా రేసులోకి అడుగుపెట్టేందుకు కూడా అఖిల్ అన్ని విధాల సన్నద్దం అవుతున్నాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.