సంక్రాంతి పోరు నుంచి మరో హీరో ఔట్

సంక్రాంతి పోరు నుంచి మరో హీరో ఔట్

అఖిల్ అక్కినేని ప్రస్తుతం చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నాట్లు ప్రకటించారు. ఈ సినిమా బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో పూజా హిగ్దే హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమామాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా మంచి స్పందనే అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పోరునుంచి తప్పుకుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. కాకపోతే కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉండటంతో సంక్రాంతి పోరు నుంచి ఈ సినిమా తప్పుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అఖిల్‌కు మంచి విజయం అందిస్తుతందని నమ్మకంతో ఉన్నారు. దీని తరువాత సరేంధర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అఖిల్ ఓకే చెప్పాడు. మరి ఈ సినిమాతో అఖిల్ విజయాల బాట పడతాడా లేదా అనేది చూడాలి.