క్రిష్ దర్శకత్వంలో అఖిల్..?

క్రిష్ దర్శకత్వంలో అఖిల్..?

అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను.. సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం వెనుకబడిపోయింది. ఇప్పుడున్న సమయంలో కలెక్షన్లు వస్తేనే హిట్ అని అనుకుంటున్న సమయంలో మిస్టర్ మజ్ను పరాజయం పాలైందని చెప్పాలి.  నటన పరంగా అఖిల్ మంచి మార్కులే కొట్టేశాడు.  ఇప్పుడు అఖిల్ నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.  

అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ పేర్లు పరిశీలిస్తున్నారు.  ఇదిలా ఉంటె, క్రిష్ చెప్పిన కథ అఖిల్ కు అటు నాగార్జునకు నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారని సమాచారం.  ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే నాగార్జున నిర్మిస్తారట.  అఖిల్ కొంతకాలం రెస్ట్ తీసుకున్న తరువాతే నెక్స్ట్ సినిమా చేస్తాడని తెలుస్తోంది.