సీఐడీ విచారణకి భూమా అఖిలప్రియ ?

సీఐడీ విచారణకి భూమా అఖిలప్రియ ?


ఈరోజు విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారంటూ భూమా అఖిల ప్రియ గతంలో ఆరోపణలు చేశారు. మే నెలలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యల పై ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఫిర్యాదు చేయడంతో.. సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. ఇవాళ కర్నూలులో భూమా అఖిల ప్రియను విచారించనున్నారు సీఐడీ అధికారులు.

తనను అప్రతిష్ఠపాలు చేస్తున్నారంటూ అప్పట్లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ డీజీపీతో పాటు సీఎంకు కూడా  ఫిర్యాదు చేసారు. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలే కారణమని భూమా అఖిల ప్రియ ఆ మధ్య కామెంట్ చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారంటూ ఆమె పేర్కొన్నారు. అలానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ చేశారని.. ఎమ్మెల్యేల తీరు చూసి అందరూ నవ్వుతున్నారని.. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది అప్పట్లో ఆమె కామెంట్ చేశారు.