అఖిల్ ట్రీట్ నాగార్జున బర్త్ డే రోజేనా ?

అఖిల్ ట్రీట్ నాగార్జున బర్త్ డే రోజేనా ?

అఖిల్ అక్కినేని తన మూడవ సినిమాను 'తొలిప్రేమ' చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.  ఈ సినిమా కథ ఎక్కువగా   లండన్ నేపథ్యంలో జరగనుండటంతో చాలా రోజుగా చిత్ర యూనిట్ అక్కడే షూటింగ్ జరుపుతోంది. 

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ అక్కిదున్ని నాగార్జునగారి పుట్టినరోజునాడు విడుదలయ్యే అవకాశాలున్నాయట.  అయితే దీనిపై ఇంకా అఖిల్ అండ్ టీమ్ నుండి అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.  నిధి అగర్వాల్ కథానాయకిగా నస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు.