మళ్లీ కన్ఫ్యూజన్‌లో అక్కినేని హీరో.. హిట్ కోసం అది తప్పదా?

మళ్లీ కన్ఫ్యూజన్‌లో అక్కినేని హీరో.. హిట్ కోసం అది తప్పదా?

సంక్రాంతి అంటే ప్రతి ఏడాది బాక్సాఫీస్ యుద్దాలు భారీగానే ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం అసలైన యుద్దాన్ని తలపించేలా ఉంది. ఈ హీరో కూడా అంత సులభంగా వెనకడుగు వేయడంలేదు. కుదదిరినంత వరకు సెలవులను లక్ష్యంగా చేసుకొని సినిమాలను టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి రేసులో రవితేజ, రామ్, రానా ఇలా చాలామంది బాడా హీరోలు తలపడుతున్నారు. ఇదే సమయంలో అక్కినేని అఖిల్ కూడా తన సినిమాను విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ తన సినిమాపై వీరి ప్రభావం కచ్చితంగా పడుతుంది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజ నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉండి. దీనిపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమా ఏప్రిల్ లేదా మేలో విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఏప్రిల్16న నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా విడుదల కానున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా అదే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు. వాటితో  పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా మే మొదటి వారంలో రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో విడుదలైతే అఖిల్ సినిమా నిలదొక్కుకోవడం కష్టమే. దాంతో సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని అఖిల్ కన్ఫ్యూజన్‌లో పడ్డాడు. ఈ సినిమాపై అఖిల్ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకు కచ్చితంగా హిట్ ఇస్తుందని నమ్మాడు. అయితే తనకు హిట్ కావాలంటే స్టార్ హీరోలతో తలపడాల్సిందేనా అనే సందిగ్దంలో అఖిల్ ఉన్నాడు. మరి తన సినిమా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.