సమంతకు అక్కినేని అమల ఛాలెంజ్

సమంతకు అక్కినేని అమల ఛాలెంజ్

సోషల్ మీడియాలో రోజుకో కొత్త ఛాలెంజ్ పుట్టుకొస్తుంటుంది.  కొన్ని ఛాలెంజ్ లు వైరల్ అయితే, మరికొన్ని ఎప్పుడు ప్రారంభమౌతాయో.. ఎక్కడ ఎండ్ అవుతాయో చెప్పలేము.  ఐస్ బకెట్ ఛాలెంజ్ బాగా పాపులర్ అయింది.  సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరు ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.  

దీని తరువాత ఇండియాలో స్వచ్ఛభారత్ ఛాలెంజ్, ఫిట్నెస్ ఛాలెంజ్, కికి ఛాలెంజ్ ఇలా ఎన్నో వచ్చాయి.  ఇందులో కికి ఛాలెంజ్ కు జనాలు ఫిదా అయ్యారు.  ఇప్పుడు మరో ఛాలెంజ్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నది.  అదే రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్.  పుస్తకాలు చదవడం అన్నది ఓ మంచి హ్యాబిట్.  దానిని అలవాటుగా మార్చుకుంటే లైఫ్ లో చాల విషయాలు నేర్చుకోవచ్చు.  ఈ అంశతోనే రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్ నెట్ ముందుకు వచ్చింది.  అక్కినేని అమలను రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఛాలెంజ్ ను విసిరాడు.  దీనిని అమల స్వీకరించింది.  స్టోరీస్ ఎట్ వర్క్ అనే బుక్ చదువుతున్నట్టు ఫోటో షేర్ చేసింది.  అంతేకాదు, అక్కినేని అమల ... సమంతకు, ఉపాసనకు అలాగే సుమంత్ కు ఈ ఛాలెంజ్ విసిరింది.  దీనిపై వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.