అక్కినేని ఫ్యామిలీ పార్టీ..!!
అక్కినేని ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వినాయక చవితి రోజున వచ్చిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ సినిమాలు విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో పాటు ఇటీవలే సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజైన నాగార్జున దేవదాస్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది.
చాలా కాలం తరువాత నాగార్జునకు హిట్ రావడంతో.. ఆ హిట్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నాగార్జున, అమల, నాగ చైతన్య, సమంత, అఖిల్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు ఫారెన్ వెళ్లారు. అక్కడ నుంచి ఓ ఫోటోను నాగ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. హాలిడే ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నది.
నాగ చైతన్య, సమంత ఫస్ట్ వెడ్డింగ్ డే కు ముందే ఇలాంటి హిట్స్ రావడం ఆనందించ దగ్గ విషయమే. అక్టోబర్ 5 వ తేదీన వెకేషన్ నుంచి తిరిగి వస్తారట. అక్టోబర్ 6 వ తేదీన నాగచైతన్య, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రారంభమయ్యే సినిమాలో పాల్గొంటారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)