ఒకరికొకరు తోడుగా అక్కినేని హీరోలు !

ఒకరికొకరు తోడుగా అక్కినేని హీరోలు !

ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితి మారిపోయింది.  ఇంతకుముందులా నా సినిమాలు, నా స్టార్ డమ్ అనే ధోరణి హీరోల్లో చాలా వరకు తగ్గు ముఖం పట్టింది.  ఇప్పుడు యువ, సీనియర్ హీరోలు చాలామంది ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారు.  అలాంటి వారిలో అక్కినేని కుర్ర హీరోలు ముందున్నారు.  అక్కినేని యుత్వ్ హీరోల్లో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండగా అందరిలోకి సీనియర్ అయిన సుమంత్, మరొక హీరో సుశాంత్ లు పెద్ద హిట్లు లేక కొంత వెనుకబడిఉన్నారు. 

అందుకే చైతు, అఖిల్ ఇద్దరూ ఆ సుమంత్, సుశాంత్ లకు తమ సపోర్ట్ అందజేస్తున్నారు.  వాళ్ళ రాబోయే సినిమాల ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.  అఖిల్ సుమంత్ యొక్క కొత్త సినిమా 'ఇదం జగత్' ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలుపగా నాగచైతన్య అయితే త్వరాలో విడుదలకానున్న సుశాంత్ యొక్క 'చి.ల.సౌ' సినిమా ప్రచారానికి సమయం కేటాయించారు.  ఇక ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు హీరోలు ఎంతో సయోధ్యగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తుండటం హర్షించదగిన విషయమే.