చై చేతుల మీదుగా చిలసౌ కాన్సెప్ట్ పోస్టర్

చై చేతుల మీదుగా చిలసౌ కాన్సెప్ట్ పోస్టర్
సుశాంత్ హీరోగా వస్తున్న చిలసౌ సినిమా షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా విడుదల చేయబోతున్నారు.  బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ పోస్టర్ ను విడుదల చేస్తారని సిరుని సినిమా కార్పొరేషన్ పేర్కొంది.  నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న ఈ సినిమా ద్వారా రుహాని శర్మ అనే కథానాయికి వెండితెరకు పరిచయం కానున్నది.  పక్కా రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.  
 
కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిలసౌ సుశాంత్ కెరీర్ లో మంచి హిట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి.  చాలా కాలం నుంచి సుశాంత్ కు మంచి సినిమాలు లేవు.  దీంతో సుశాంత్ కెరీర్ అయోమయంలో పడింది. ఇప్పుడు రాబోతున్న చిలసౌ పైనే సుశాంత్ ఆశలు పెట్టుకున్నారు.  కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సుశాంత్ బలంగా నమ్ముతున్నాడు.