అమీర్ ఖాన్ సినిమాలో అక్కినేని హీరో..

అమీర్ ఖాన్ సినిమాలో అక్కినేని హీరో..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా అమీర్ ఖాన్ పేరు తెచ్చుకున్నాడు. అతడు చేసే ప్రతి సినిమా కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. అంతేకాకుండా అతడు ప్రతి సినిమాతో కొత్త తరహా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. అతడి సినిమాలో చేయాలని అనేక మంది యువ హీరోలు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ అవకాశం టాలీవుడ్ హీరోకి అందిందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ సినిమాలో అక్కినేని యువ హీరో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం థాంక్యు సినిమా చిత్రీకరణలో ఉన్న నాగచైతన్య తన బాలీవుడ్ పరిచయాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నాడట. ఇదిలా ఉంటే అమిర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులోని సపోర్టింగ్ పాత్ర కోసం మొదటగా తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఓకే చేశారట. కానీ డేట్స్ కారణంగా విజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ సినిమా మేకర్స్ ఈ పాత్ర చేసేవారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.చివరకు ఈ పాత్రకు నాగచైతన్యను అనుకున్నారట. ఈ అవకాశంపై నాగచైతన్య త్వరలో తన నిర్ణయం తెలపనున్నాడు. నాగచైతన్యకు తన హిందీ పరిచయం కోసం ఇది ఓ మంచి అవకాశంగా భావించవచ్చు, దీంతో నాగచైతన్య మార్కెట్ కూడా చాలా పెరుగుతుంది. మరి ఈ విషయంలో నాగచైతన్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.