రష్మిక గురించి నాగ్ ఫన్నీ కామెంట్స్..!!

రష్మిక గురించి నాగ్ ఫన్నీ కామెంట్స్..!!

ఛలో, గీత గోవిందం వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న రష్మిక తన మూడో సినిమాగా దేవదాస్ చేస్తున్నది.  ఈ సినిమాలో పూజ క్యారెక్టర్ తో ఆకట్టుకుందని సమాచారం.  రష్మిక సెట్స్ లో ఎలా ఉంటుంది అనే విషయాన్ని అటు నాగార్జున, నానిలు పదేపదే చెప్పారు.  రష్మిక చాలా చలాకీగా ఉంటుందని నాని చెప్పగా.. రష్మిక గురించి నాగ్ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు.  

థాయిలాండ్ లో షూట్ ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో ఫ్లైట్ లో రష్మిక తన పక్కన కూర్చుందని, తనకు బాడీ గార్డ్ గా పనిచేసిందని చెప్పారు.  ఫ్లైట్ లో మందు కొట్టిన కొందరు ముందుకు వచ్చి గొడవ చేస్తుంటే.. వాళ్ళని రెండు కొట్టినట్టు నాగ్ పేర్కొన్నారు.  తనకు బాడీగార్డ్ గా వ్యవహరించిన రశ్మికకు నాగ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు.