అక్కినేని అభిమానులకు షాక్ : కోడలు ఇలా ఎంట్రీ ఇవ్వబోతోంది... 

అక్కినేని అభిమానులకు షాక్ : కోడలు ఇలా ఎంట్రీ ఇవ్వబోతోంది... 

అక్కినేని కోడలు అంటే గుర్తుకు వచ్చేది సమంత.  సినిమా ఇండస్ట్రీలో సమంతకు మంచి పేరు ఉన్నది.  నాగచైతన్యను వివాహం చేసుకున్న తరువాత కూడా వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి జాను సినిమా చేస్తున్నది.  తమిళంలో సూపర్ హిట్టైన 96 సినిమాకు ఇది రీమేక్.  ఈ మూవీ వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నది.  

ఈ సినిమా తరువాత భర్త నాగచైతన్యతో సినిమా చేయబోతున్నది.  సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్, ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  త్వరలోనే ఈ స్టార్ హీరోయిన్ బుల్లితెర రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.  సినిమా ప్రపంచంలో రాణించిన సమంత, ఇప్పుడు బుల్లితెరపై కుడి రాణించేందుకు రెడీ అవుతున్నది.  ఓ టాక్ షో ను రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం.  ఎప్పుడు ఏ చానల్లో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.