హాట్ అప్పీల్ కు కేరాఫ్ అడ్రసే.. కానీ... 

హాట్ అప్పీల్ కు కేరాఫ్ అడ్రసే.. కానీ... 

సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఒకటి అదృష్టం ఉండాలి.. బ్యాక్ గ్రౌండ్ ఉండాలి.. అంతకు మించి గ్లామర్ ఉండాలి.. సోషల్ మీడియాలో పాపులర్ కావాలి.. అదృష్టం.. బ్యాక్ గ్రౌండ్ ఏమోగానీ, ఆ హీరోయిన్ గ్లామర్ గా కనిపించడంలో అందరికంటే ముందు ఉంటుంది.  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. లక్షలాది మంది ఫాలోవర్లను పెంచుకుంది.  స్కిన్ షోకు ఏ మాత్రం అడ్డు చెప్పదు.. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా.. ఎవరో కాదు నాగార్జునతో మన్మధుడు 2లో లిప్ లాక్ లతో హీట్ పెంచిన తార అక్షర గౌడ్.  

కన్నడంనుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.  అదిరిపోయే రేంజ్ లో ముద్దుల వర్షం కురిపించింది. అయితే, ఈ ముద్దులు సినిమాను గట్టెక్కించలేకపోయింది. సినిమా ప్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు.  కన్నడం నుంచి టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనుష్క, రష్మిక, సంజనా, నభా నటేష్ లు దూసుకుపోతున్నారు.  అక్షర మాత్రం హాట్ గా కనిపిస్తున్నా.. హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. ఎంత హాట్ గా కనిపించినా విజయాలే అవకాశాలను తీసుకొస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  ఇప్పుడు అక్షరకు ఓ మంచి విజయవంతమైన సినిమా కావాలి.