అక్షర టీజర్ టాక్.. కొంచెం సస్పెన్స్ కొంచెం కామెడీ..!!

అక్షర టీజర్ టాక్.. కొంచెం సస్పెన్స్ కొంచెం కామెడీ..!!

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సినిమాలు వరసగా వస్తున్నాయి.  తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం పొందటానికి ఇదొక మార్గంగా కనిపిస్తోంది.  అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.  ఈ జానర్లో వరసగా సినిమాలు వస్తున్నాయి.  వచ్చిన ప్రతి సినిమాలో ఎదో ఒక సస్పెన్స్ ఉంటోంది.  అలాంటి సస్పెన్స్ కథతో తెరకెక్కిన సినిమా అక్షర.  ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  

అజయ్ ఘోష్ వాయిస్ తో టీజర్ ఓపెన్ అవుతుంది.  పెద్ద వయసు కలిగిన ఓ వ్యక్తికి ఏ పనిపాట లేని ముగ్గురు వ్యక్తులు పరిచయం అవుతారు.  ఆ ముగ్గురు టిక్ టాక్ లు చేసుకుంటూ కాలం గడుపుతుంటారు.  అలాంటి ఈ ముగ్గురు అజయ్ ఘోష్ తో పరిచయం అయ్యాక ... అనుకోకుండా వారి లైఫ్ లోకి నందిత శ్వేతా వస్తుంది.  ఆ అమ్మాయిని ఈ నలుగురు చంపాలని అనుకుంటారు.  ఎందుకు చంపాలని అనుకున్నారు.  అసలు ఏం జరిగింది అన్నది కథ.  సస్పెన్స్ గా ఉన్న ఈ చిన్న టీజర్ లో కాస్త కామెడీని మిక్స్ చేశారు.  మొత్తానికి పర్వాలేదనిపించింది టీజర్.