18 ఏళ్ల రూల్ ను బ్రేక్ చేసిన అక్షయ్ .. దేనికోసమంటే

18 ఏళ్ల రూల్ ను బ్రేక్ చేసిన అక్షయ్ .. దేనికోసమంటే

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాది ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల 'హౌస్ ఫుల్ 4', 'గుడ్ న్యూస్' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అక్షయ్.. సూర్యవంశీ, లక్ష్మీబాంబ్, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, బెల్ బాటమ్’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఇక బెల్ బాటమ్ సినిమా కోసం ఇటీవల అక్షయ్ అతని చిత్రయూనిట్ చార్టర్డ్ విమానంలో  స్కాట్లాండ్‌కు వెళ్లారు.అత్యంత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న‘బెల్ బాటమ్’ సినిమాలో కథానాయికగా పొడుగుకాళ్ల సుందరి వాణి కపూర్‌ని ఫిక్స్ చేశారు.  అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు వాయిదా పడుతూ వస్తుంది . దాంతో ఈ సినిమా కోసం అక్షయ్ తన 18 సంవత్సరాల రూల్ ను బ్రేక్ చేసాడు. సినిమా షూటింగ్ లో రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే షూట్ చేసే అక్షయ్ బెల్ బాటమ్ సినిమాకోసం డబల్ షిఫ్ట్ చేస్తున్నాడట . వేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్షయ్ ఓవర్ టైం షూట్ చేస్తున్నాడట దాంతో నిర్మాతలకు ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన జాకీ భగ్నాని మాట్లాడుతూ “అక్షయ్ సర్ నిజంగా నిర్మాత నటుడు మరియు అతనితో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి . అతను ప్రతి ఒక్కరి గురించి , ప్రతిదీ గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. అక్షయ్ సార్ 18 సంవత్సరాలలో మొదటిసారి డబుల్ షిఫ్ట్ చేస్తున్నారు.దాంతో షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. ఇక షూటింగ్ స్పాట్ లో అక్షయ్ చాలా క్రమశిక్షణతో ఉంటారు ఆయనతావు పనిచేయడానికి అందరం ఎంతో ఎక్సయిటింగ్ గా ఫీల్ అవుతాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బెల్ బాటమ్’ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.