వందల కోట్ల సంపాదన ఉన్నా.. 100 పౌండ్ల కోసం ఆ హీరో..!!

వందల కోట్ల సంపాదన ఉన్నా.. 100 పౌండ్ల కోసం ఆ హీరో..!!

ధనమేరా అన్నిటికి మూలం... అన్నాడో సినీ కవి.  డబ్బు కోసమే అందరు పనిచేస్తుంటారు.  డబ్బు చేతిలో ఉంటె ఆ ధైర్యమే వేరు.  అందుకే సేవింగ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు.  సేవింగ్స్ లేకపోతె జీవితం అంధకార్యంగా మారుతుంది.  అందుకే సెలెబ్రిటీలు డబ్బును ఎక్కువగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి దాచుకుంటుంటారు.  

దేశంలో అత్యధిక సంపాదన ఉన్న నటుల్లో అక్షయ్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.  వరల్డ్ వైడ్ గా తీసుకుంటే 35 వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్ మ్యాగజైన్ తెలిపిన సంగతి తెలిసిందే.  సంవత్సరానికి అతని ఆదాయం రూ.444 కోట్ల రూపాయలు. ఇంట సంపాదిస్తున్న అక్షయ్ 100 పౌండ్ల కోసం ఏం చేశారో తెలుసా... 

లండన్ లో ఓ ప్లేస్ లో ఐరన్ రాడ్ ను పట్టుకొని ఎక్కువగా సేపు వేలాడితే.. వాళ్లకు 100 పౌండ్లు బహుమతిగా ఇవ్వబడును అని రాసుంది.  వెంటనే అక్షయ్ కుమార్ ఆ ఇనుప రాడ్ ను పట్టుకొని చాలా సేపు వేలాడారు.  దీనిని  వీడియో గా తీసి అయన భార్య  ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.  ఈ ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.