రివ్యూ : అక్షయ్ కుమార్ "గోల్డ్"

రివ్యూ : అక్షయ్ కుమార్ "గోల్డ్"

నటీనటులు : అక్షయ్ కుమార్, మౌని రాయ్, అమిత్ సాద్, తదితరులు 

మ్యూజిక్ : సచిన్, జిగర్

సినిమాటోగ్రఫీ : అల్వారో గుట్రేజ్ 

నిర్మాత : ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ 

దర్శకత్వం : రీమా కగ్తి

రిలీజ్ డేట్ : 15-08-2018

యదార్ధంగా జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న హీరో అక్షయ్ కుమార్.  ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ వంటివి ఈ కోవకు చెందినవే.  ఇప్పుడు అక్షయ్ నటించిన గోల్డ్ సినిమాకు అదే కోవకు చెందింది.  1948 వ సంవత్సరంలో జరిగిన ఒలంపిక్స్ లో ఇండియాకు హాకీలో స్వర్ణం సాధించిన భారత టీమ్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.  ఇందులో అక్షయ్ హాకీ టీమ్ కోచ్ పాత్రలో నటించారు.  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

భారత హాకీ జట్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంటాడు అక్షయ్ కుమార్.  అప్పటి హాకీ జట్టుకు అక్షయ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు.  బ్రిటిష్ పరిపాలన కొనసాగిన రోజుల్లో మూడుసార్లు బ్రిటన్ క్రీడాకారులే పథకాలు సాధిస్తారు.  1947 లో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది.  ఆ మరుసటి సంవత్సరం జరిగే ఒలంపిక్స్ లో ఇండియా జట్టు ఎలాగైనా పతకం గెలవాలి అన్నది అక్షయ్ కుమార్ లక్ష్యం.  1948 లో బ్రిటన్ వేదికగా ఇండియా - బ్రిటిష్ జట్లమధ్య హాకీ మ్యాచ్ జరుగుతుంది.  భారత దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ జట్టును ఎలాగైనా ఓడించాలి అనే పట్టుదలతో టీమ్ కలిసి కట్టుగా ఆడుతుంది... ? కలిసికట్టుగా ఆడిన ఇండియా జట్టు ఎలా స్వర్ణ పతకం సాధించింది..? పతకం సాధించే సమయంలో ఎదురైన అడ్డంకులు ఏంటి..? వాటిని టీమ్ ఎలా అధికమించింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

హాకీ నేపథ్యంలోనే సినిమా అంతా తెరకెక్కింది.  1948 నాటి పరిస్థితులను చక్కగా చూపించారు.  ఒలంపిక్స్ గేమ్స్ జరిగిన వెంబ్లీ స్టేడియాన్ని తలపించేలా నిర్మించిన సెట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.  భారత.. బ్రిటిష్ క్రీడాకారుల మధ్య జరిగే గేమ్ ఎపిసోడ్ ఆద్యతం రక్తికట్టించింది.  ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.  మనం ఆ స్టేడియంలోని ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది.  దర్శకురాలు రీమా కగ్తి ఈ ఎపిసోడ్స్ ను అద్భుతంగా చిత్రీకరించింది.

నటీనటుల పనితీరు : 

అసిస్టెంట్ మేనేజర్ పాత్రలో అక్షయ్ కుమార్ ఒదిగిపోయి నటించారు.  అక్షయ్ కుమార్ ముందుండి సినిమాను నడిపించాడు.  ఇండియా గొప్పదనం, త్యాగాల గురించి బ్రిటీషర్ల ముందు అక్షయ్ కుమార్ చెప్పిన డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.  మౌనిరాయ్ తన పాత్రమేరకు మెప్పించింది.  హాకీ క్రీడాకారులుగా నటించిన నటీనటులు, కోచ్ పాత్రలో అంటించిన కునాల్ కపూర్ నటన ఆకట్టుకుంటుంది.  నిజజీవితం ఆధారంగా రూపొందిన సినిమా పైగా స్పోర్ట్స్ కథ కావడంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.  

సాంకేతికం : 

సాంకేతిక వర్గం గురించి చెప్పుకునే ముందు ఈ సినిమాకు కథ అందించిన జావేద్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  పాటల రచయితగా మెప్పించిన జావేద్, కథ రూపంలో మరోసారి మెప్పించాడు. జావేద్ అందించిన కథకు దర్శకురాలు తయారు చేసుకున్న స్క్రీన్ ప్లే సూపర్ గా ఉన్నది.  అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్టుగా ఉన్నా..కథలో లీనమైపోతాము కాబట్టి అది పెద్దగా అనిపించదు.  స్పెయిన్ సినిమాటోగ్రాఫర్ అల్వారో గుట్రేజ్  అందించిన ఫొటోగ్రఫీ సూపర్ గా ఉంది.  స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇండియా ఎలా ఉండేదో అలా చూపించాడు.  సచిన్, జిగర్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ

కథనాలు 

నటీనటులు 

అక్షయ్ కుమార్ 

డైలాగ్స్ 

మ్యూజిక్ 

ఫోటోగ్రఫి 

దర్శకత్వం 

బలహీనతలు : 

పెద్దగా లేవు 

చివరిగా :  ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా