అక్షయ్ లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్

అక్షయ్ లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్

బాలీవుడ్ లో వివిధ రకాలైన ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు.  కమర్షియల్ సినిమాలతో పాటు అన్ని రకాల ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాల్లో నటించి మెప్పించే తత్త్వం కలిగిన నటుడు అక్షయ్.  వరసగా పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తూనే... కథ నచ్చితే చిన్న దర్శకులతో కూడా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంటాడు అక్షయ్.  

టాలీవుడ్, కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లారెన్స్ రాఘవ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  ఫాక్స్ స్టార్ ఇండియా నిర్మాణంలో లక్ష్మి బాంబ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్ రాఘవ.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా జూన్ 5, 2020 న రిలీజ్ అవుతుందట.