అక్షయ్ మిషన్ మంగళ్ టీజర్ టాక్

అక్షయ్ మిషన్ మంగళ్ టీజర్ టాక్

అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా మిషన్ మంగళ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మార్స్ గ్రహం మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.  ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇండియా సక్సెస్ అయ్యింది.  మార్స్ పైకి ఉపగ్రహాలు ప్రయోగించిన అరుదైన దేశాల జాబితాలో ఇండియా కూడా చేరిపోవడం విశేషం.  

ఈ జైత్రయాత్రను బేస్ చేసుకొని మిషన్ మంగళ్ పేరుతో సినిమా తీసింది  బాలీవుడ్. దీనికి సంబంధించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.  సెలెబ్రిటీలు సైతం టీజర్ ను ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి, నిత్యామీనన్ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి జగన్ శక్తి దర్శకుడు.