అక్షయ్ కుమార్ ఆవేదన...! పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు...

అక్షయ్ కుమార్ ఆవేదన...! పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు...

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ పౌరసత్వం విషయంలో ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది.. పలుమార్లు ఈ విషయంలో అక్షయ్‌ కుమార్‌కు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. దీంతో ఆవేదనకు గురయ్యారు అక్షయ్.. తనను తాను భారతీయుడిగా నిరూపించుకోవడానికి డాక్యుమెంట్లు చూపించాల్సిన రోజు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్న అక్షయ్... తాను భారత పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఢిల్లీలో జరిగిన హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. భారతీయ పాస్‌పోర్ట్ కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. "నేను భారతీయుడిని, ప్రతిసారీ నిరూపించమని నన్ను కోరడం నాకు బాధ కలిగిస్తుందని ఆవేదిన వ్యక్తం చేసిన అక్షయ్... నా భార్య, నా పిల్లలు భారతీయులు. నేను ఇక్కడ నా పన్నులు చెల్లిస్తున్నాను.. నా జీవితం ఇక్కడే ఉందన్నారు.