ఇది హౌస్ ఫుల్ ఫోటో ..!!

ఇది హౌస్ ఫుల్ ఫోటో ..!!

హౌస్ ఫుల్ సిరీస్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఇప్పుడు ఈ సీరీస్ లో నాలుగో సినిమా రాబోతున్నది.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నది.  సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఇందులో నటించిన క్యాస్టింగ్ అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు.  ఇలా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  

ఫన్ 2 ఫన్ గా తెరకెక్కిన మూడు సీరీస్ లు మంచి విజయాన్ని అందుకోగా, ఎంటర్టైన్మెంట్ చేసే లక్ష్యంతోనే నాలుగో సినిమాను కూడా తెరకెక్కించారు.  అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, పూజా హెగ్డే, కీర్తి సనన్, కృతి కర్బందా తదితరులు ఈ సినిమాలో నటించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తారట.