అక్షయ్ వర్సెస్ అక్షయ్..

అక్షయ్ వర్సెస్ అక్షయ్..

అక్షయ్ కుమార్ హీరోగా అమీర్ ఖాన్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా మొఘల్.  సుభాష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.  టి సిరీస్ వ్యవస్థాపకుడైన గుల్షన్ గుమార్ జీవిత చరిత్ర ఆధారంగా మొఘల్ నిర్మితమౌతున్నది.  దీనికి సంబంధించిన ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఇటీవలే బయటకు వచ్చింది.  ఈ సినిమాను  2019 క్రిస్మస్ కు విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది.  

ఇదిలా ఉంటె, అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ హేరా ఫెరి 3 కూడా 2019 క్రిస్మస్ కు విడుదల కానున్నది.  నడియాద్వాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  హేరా ఫెరి ఫ్రాంచైసీలో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ఈ సినిమాపై కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.  అక్షయ్ కుమార్ తో పాటు ఇందులో పరేష్ రావెల్, సునీల్ శెట్టిలు కూడా నటిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గత రెండు సినిమాల్లాగే మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.  

అక్షయ్ కుమార్ నటిస్తున్న మొఘల్, హేరా ఫెరి 3 సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతుండటం చర్చనీయాంశంగా మారింది.  రెండు పెద్ద సినిమాలే.  ఒకే హీరో నటిస్తున్న సినిమా కావడంతో ఏదైనా ఒక సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకుంటే బాగుంటుందని అక్షయ్ అభిమానులు అంటున్నారు.  12 సంవత్సరాల క్రితం అక్షయ్ కుమార్ వెల్ కమ్, అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి.  ఈ రెండు మంచి విజయం సాధించాయి.  పుష్కరకాలం తరువాత మరలా రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.  కాకపొతే ఒక సినిమాను నడియాద్వాల నిర్మిస్తుంటే మరొక చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు.