అల వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్...దుమ్ము రేపుతున్నాడుగా !

అల వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్...దుమ్ము రేపుతున్నాడుగా !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా భారీ అంచానాల మధ్య నిన్నవిడుదల అయింది. పూజా హేగ్దే కథానాయకగా నటించిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల హిట్స్ తర్వాత బన్ని, అల్లు అర్జున్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి అందుకుంటూనే సినిమా విడుదలైన అన్ని ధియేటర్ల నుంచి సినిమాకి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా సరిలేరు నీకెవ్వరుతో పోటీగా రిలీజయినా ఆ సినిమాతో పాటే ఈ సినిమాకి కూడా ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు.

తోలిరోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టిందని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 30 కోట్లు రాబట్టిందని అంటున్నారు. తొలి రోజు ఏపీ, తెలంగాణలలో ఏరియాల వారీగా ఎంత కలెక్ట్ చేసిందంటే నైజాం 5 కోట్లు, సీడెడ్‌ 2.5 కోట్లు, ఉత్తరాంధ్ర 2 కోట్లు, ఈస్ట్-వెస్ట్‌ కలిపి 4.5 కోట్లు, గుంటూరు 3 కోట్లు, క్రిష్ణా, నెల్లూరులో కలిపి 3 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ నిపుణుల అంచనా మొత్తంగా చూసుకుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్లు కొల్లగోట్టినట్టు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇక ఓవర్సీస్‌లో 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మూడున్నర కోట్లుపైగానే వసూలు చేసినట్టుగా చెబుతున్నారు.