అలా వైకుంఠపురములో మరో రికార్డు

అలా వైకుంఠపురములో మరో రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా ఈ ఏడాది విడుదలైన సినిమా అలా వైకుంఠపురములో. ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న సినిమాగా ఇది రికార్డకెక్కింది. అయితే ఇటీవల ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. అయితే సాదారణంగా ఏ సినిమా విడుదాలైనా అవి ఎంత బాగున్నదనే దానికి సంబంధించి రేటింగ్‌లను ఇచ్చే వాటిలో ఐఎండీబీ సంస్థ టాప్‌లో ఉంటుంది. అయితే ఈ సంస్థ ప్రకారం అర్జున్ సినిమా ఈ ఏడాది మరో రికార్డు చేసింది. ఇప్పటి వరకు అత్యదికంగా చూసిన సినిమా ట్రైలర్లలో 20వ స్థానానంలో నిలిచింది. దేశంలోని అన్ని భాషల సినిమాలతో పోటీ పడుతూ టాప్ 20లో ఉండటమంటే గొప్పనే చెప్పాలి. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో పూజా హిగ్దే హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాతోనే అభిమానులు పూజాకు బుట్టబొమ్మగా పేరు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా 2020 జనవరీ 12న విడుదలయ్యింది. ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దాదాపు రూ.262 కోట్లు సంపాధించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.