అల వైకుంఠపురంలో డబ్బింగ్ మొదలైంది... 

అల వైకుంఠపురంలో డబ్బింగ్ మొదలైంది... 

త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫ్రాన్స్ లో జరుగుతున్నది.  ప్యారిస్ లో సినిమా సాంగ్స్ షూట్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె,  ఈ సినిమాలో మెయిన్ కీ రోల్ చేస్తున్న అక్కినేని సుశాంత్ పాత్రకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.  

దీనికి సంబంధించి సుశాంత్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు.  సుశాంత్ డబ్బింగ్ చెప్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.  వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది.  పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నది.