అల వైకుంఠపురంలో పాటల పండగ డేట్ ఫిక్స్ 

అల వైకుంఠపురంలో పాటల పండగ డేట్ ఫిక్స్ 

అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది బన్నీ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.  ఎందుకంటే ఇటీవల కాలంలో బన్నీకి సరైన హిట్ లేదు.  త్రివిక్రమ్ ను నమ్ముకొని బన్నీ సినిమా చేస్తున్నారు.  గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.  రెండు మంచి విజయం సొంతం చేసుకున్నాయి.  ఇది మూడో సినిమా.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే .  

ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు.  ఈ సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా పాటల వేడుకకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.  జనవరి 6 వ తేదీన పాటలను రిలీజ్ చేయబోతున్నారు.  యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగబోతున్నది.  అయితే, ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరు ఏంటి అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.  ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరవుతారని టాక్ వస్తోంది.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.