బన్నీ ఫ్యాన్స్‌కి ట్రీట్ రెడీ... 'అలవైకుంఠపురంలో' టీజర్ ఎప్పుడంటే...

బన్నీ ఫ్యాన్స్‌కి ట్రీట్ రెడీ... 'అలవైకుంఠపురంలో' టీజర్ ఎప్పుడంటే...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న చిత్రం 'అలవైకుంఠపురంలో...' ఈ మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలచేసిన పాటలు ఇప్పటికే పెద్ద సక్సెస్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలోని 'సమజవరగమనా...' అంటూ సాగే పాట ఎంత పాపులారిటీ పొందిందంటే.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోట అదేపాట వినిపిస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టైం కూడా వచ్చింది.. ఈ సినిమా టీజర్ ఈ నెల 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతకంటే ముందే మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు బన్నీ... ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు మినీ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ బృందం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.