అల్లాద్దీన్ టీజర్ 2 టాక్

అల్లాద్దీన్ టీజర్ 2 టాక్

హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో భారీ డిమాండ్ ఏర్పడింది.  స్పీల్ బర్గ్ సినిమాలే అందుకు నిదర్శనం.  టైటానిక్, అవతార్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో తెలిసిందే.  రీసెంట్ గా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా భారీ హిట్టైంది.  కలెక్షన్ల పరంగా ఇండియాలోను దూసుకుపోతున్నది.  ఇప్పటికే రూ. 400 కోట్ల రూపాయయలకు పైగా వసూలు చేసింది ఈ సినిమా.  

ఇదే కోవలో అందరిని అలరించేందుకు డిస్ని సంస్థ అల్లాద్దీన్ సినిమాను రిలీజ్ చేయబోతున్నది.  తెలుగులో ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పారు.  ఈ సినిమాలోని రెండో టీజర్ ను కూడిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ప్రతి ఒక్కరిని ఈ టీజర్ అక్కట్టుకుంటున్నది.  యానిమేషన్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.