జిన్నా పేరుతో పాక్ మద్యం... సోషల్ మీడియాలో వైరల్ 

జిన్నా పేరుతో పాక్ మద్యం... సోషల్ మీడియాలో వైరల్ 

ప్రతి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే వాటిల్లో మద్యం కూడా ఒకటి.  మద్యం పేర్లతో కొన్ని పేర్లు పాపులర్ అయితే, కొన్నింటికి పాపులర్ పేర్లను మద్యానికి పెడుతుంటారు.  పాకిస్తాన్ పితామహుడిగా పేరుగాంచిన జిన్నా పేరును ఓ జిన్ కు పెట్టారు.  ఆ జిన్ బాటిల్ ను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  బాటిల్ పేరు కింద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ అని రాసుంది.  1947లో ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయిన తరువాత ఆ దేశంలో మహానేతగా ఎదిగారు.  అక్కడి కరెన్సీ నోట్లపై జిన్నా ఫోటోలు కనిపిస్తాయి.  అయితే, జిన్నాకు మంచి స్కాచ్, జిన్ అంటే మహా ప్రీతి.  వీటిని అయన ఎప్పుడు ఖండించలేదు అని ఆ జిన్ లేబుల్ పై రాసుంది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  జిన్నాపేరుతో వచ్చిన ఈ పానీయాన్ని జాతీయ పానీయంగా ప్రకటించాలని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.