అలర్ట్.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..

అలర్ట్.. మరో ఐదు రోజులు భారీ వర్షాలు..

ఓవైపు నిత్యం భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు.. మరోవైపు మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన హెచ్చరికలు కలవరపెడుతోంది. వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తన ప్రకటనలో పేర్కొంది.