ముఖం పగిలి రక్తం కారినా బ్యాటింగ్ చేశాడు

ముఖం పగిలి రక్తం కారినా బ్యాటింగ్ చేశాడు

ఈరోజు వరల్డ్ కప్ రెండవ సెమీ ఫైనల్స్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే తడబడి ఓపెనర్లు ఫించ్(0), వార్నర్ (9) వికెట్లను కోల్పోయింది.  ఆ తరవాత హ్యాండ్స్‌కాంబ్‌(4) సైతం ఓటవడంతో జట్టు కష్టల్లో పడింది. 

ఇలాంటి క్యాష్ కాలంలోనే స్మిత్, అలెక్స్ క్యారీల జోడీ సమయోచితంగా ఆది ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు.  అంతా సరిగానే జరుఇగుతుందనుకునే తరుణంలోనే బౌలర్ ఆర్చర్ వేసిన బంతి ముఖాన్ని తాకడంతో అలెక్స్ క్యారీ గడ్డం పగిలి రక్తం కారింది.  అయినా అలెక్స్ వెనుదిరగలేదు.  చికిత్స తీసుకునే తలకి కట్టు కట్టుకునే బ్యాటింగ్ చేశాడు.  70 బంతుల్లో 46 పరుగులు చేసి భాద్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  అంత పేద దెబ్బ తగిలినా బ్యాటింగ్ చేసిన క్యారీని క్రికెట్ అభిమానులంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు.  మొత్తం మీద 49 పరుగులకు ఆలౌట్  అయిన ఆసిస్ 223 పరుగులు చేసింది.  స్మిత్ (85), మ్యాక్స్వెల్ (22), స్టార్క్ (29) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.