అలీ చేతికి జబర్దస్త్ పగ్గాలు !

అలీ చేతికి జబర్దస్త్ పగ్గాలు !

టాప్ రేటెడ్ కామెడీ షో 'జబర్దస్త్' ఇన్నాళ్లు నాగబాబు పర్యవేక్షణలో నడిచింది.  కానీ ఈమధ్యే ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి చేరి రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు.  దీంతో ఆయన స్థానంలో స్టార్ కమెడియన్ అలీ జబర్దస్త్ షో న్యాయ నిర్ణేతగా కొన్నాళ్ల పాటు వ్యవహరించనున్నారు.  ఇప్పటికే ఆయనతో కొన్ని షోలను షూట్ చేయడం కూడా జరిగింది.  పనుల నుండి తీరిక దొరికాక మళ్ళీ నాగబాబు యాథావిధిగా న్యాయ నిర్ణేతగా తన స్థానంలోకి రానున్నారు.