కునుకు లేని రాజకుమారి

కునుకు లేని రాజకుమారి

బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ హీరోయిన్ ఎవరు అంటే అలియా అనే చెప్తాం. అలియా భట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. గల్లీబాయ్ హిట్ తరువాత అలియా కళాంక్, బ్రహస్త్ర, తక్త్ సినిమాలు చేస్తోంది.  దీనితో పాటు టాలీవుడ్లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర చేస్తోంది. ఈ పాత్ర కీలకమైన పాత్ర..  రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది.  

ఇదిలా ఉంటె, కళాంక్ సినిమాలో రూప్ అనే రాజకుమారి పాత్రలో చేస్తోంది.  రాజకుమారికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  తన చుట్టూ ఎందరు భారీ తారాగణం ఉన్నా ఆలియా ముందు దిగదుడుపే అన్నంత అందంగా కనిపిస్తోంది. అలాగే రూప్ అందచందాల్ని ఎలివేట్ చేసే పోస్టర్ ఇదివరకూ రిలీజై కుర్రకారు మనసు దోచింది. ఇకపై ఓ పాటను తొందర్లోనే లాంచ్ చేయబోతున్నారట. ఆ పాట కోసం ఆలియా ఎంతో శ్రమించిందట.  రోజులు.. నెలల పాటు షూటింగ్ లో తనకు నిదురే కరువయ్యేలా చేసిన  ఆ పాట ఔట్ పుట్ చూసుకోవాలని ఆలియా తహతహలాడుతోంది. ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉందని చెబుతోంది.