కరోనా కాలంలో ఆలీబాబాకు భారీ లాభాలు... 

కరోనా కాలంలో ఆలీబాబాకు భారీ లాభాలు... 

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కాలంలో అనేక సంస్థలు నష్టాలు చవిచూశాయి.  ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి.  కొన్ని కంపెనీలు లాభాలబాట పట్టిన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా చైనాకు చెందిన అలీబాబా ఇ కామర్స్ సంస్థ భారీ లాభాలు సాధించింది.  గతంలో ఎప్పుడూ లేనంతగా అలీబాబా సంస్థ లాభాలు ఆర్జించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.  ఈ ఏడాది 1.5 ట్రిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్టు సంస్థ పేర్కొన్నది.  కరోనా లాక్ డౌన్ సమయంలో అలీబాబా కోట్లాది వినియోగదారులకు చేరువైంది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో లాభాలు ఆర్జించలేదని సంస్థ ప్రకటించింది.  ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యాపారవేత్తలు కూడా భారీ లాభాలు ఆర్జించారు.