చంద్రబాబుపై దాడికేసు ప్రధాన నిందితుడికి బెయిల్..

చంద్రబాబుపై దాడికేసు ప్రధాన నిందితుడికి బెయిల్..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ కేసు సహా పలు సంచలన కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్‌ గంగిరెడ్డికి బెయిల్ వచ్చేసింది. గాజుల మండ్యం కేసులో కొల్లం గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది తిరుపతి కోర్టు. ఇవాళ సాయంత్రం కొల్లం గంగిరెడ్డి.. తిరుపతి జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. కాగా, కడప జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డిపై 26 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులతో పాటు మరో 16 కేసులున్నాయి. మొత్తం గంగిరెడ్డిపై 42 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలోనూ బెయిల్ మంజూరు చేసింది తిరుపతి కోర్టు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బ్లాస్ట్ కేసులోనూ ప్రధాన నిందితుడుగా ఉన్న గంగిరెడ్డి. ఒక పారిశ్రామిక వేత్త హత్యలోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కేసుల ఉచ్చు బిగియడంతో.. నకిలీ పాస్ పోర్టులతో వివిధ దేశాల్లో తలదాచుకున్నాడు. దాంతో ఇంటర్ పోల్ అధికారులు గంగిరెడ్డి ఫోటోను ఇంటర్నెట్ లో పెట్టారు. అయితే మలేసియాలో గంగిరెడ్డి తలదాచుకున్న విషయం తెలుసుకున్న ఇంటర్ పోల్ అధికారులు అతడిని ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.