'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో హాలీవుడ్ అందం

'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో హాలీవుడ్ అందం

దర్శక ధీరుడు రాజమోళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. వీరిద్దరి వేరువేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. తాజాగా'రామరాజు ఫర్ భీమ్' వీడియోను రిలీజ్ చేసాడు జక్కన్న. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించేలా టీజర్ ను డిజైన్ చేసాడు రాజమౌళి. దీంతో ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. ఇక చిత్రంలో చరణ్ సరసన సీత పాత్రలో అలియాభట్ నటిస్తుంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన దాంతో ఒక్కొక్కరుగా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు . తాజాగా హాలీవుడ్ భామ అలిసన్ డూడీ కూడా ఇండియాలో అడుగుపెట్టిందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ ఓ ప్రత్యేక పాత్రకోసం అలిసన్ డూడీని తీసుకున్నాడు జక్కన . ప్రస్తుతం షూటింగ్ లో  పాల్గొనేందుకు అలిసన్ డూడీ ఇండియా చేరుకుంది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఈ భామ .