ఆలయ ప్రవేశం చేసిన మహిళల నేపథ్యమిదీ.. 

ఆలయ ప్రవేశం చేసిన మహిళల నేపథ్యమిదీ.. 

వారిద్దరూ అనుకున్నది సాధించారు. ఒడిదుడుకులు, తిరస్కారాల మధ్య శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత మొదటిసారి అయ్యప్ప ఆలయ ప్రవేశం చేసిన బిందు, కనకదుర్గ పేర్లు. ఇప్పుడు మార్మోగుతున్నాయి. కోజికొడె జిల్లాకు చెందిన వీరిద్దరూ ఇవాళ తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో అయ్యప్పను దర్శించుకున్నారు. 

డిసెంబరు 18న వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో పంబ నుంచి సన్నిధానానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న మారకూటం వరకు చేరుకున్నా.. భక్తులు వీరిని అడ్డుకోవడంతో ఆ సమయంలో పోలీసులు వారిని వెనక్కి పంపించారు. తాజాగా ఇవాళ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లగలిగారు. 

ఇక.. బిందు, కనకదుర్గ నేపథ్యాలను పరిశీలిస్తే.. బిందు వయసు 44 సంవత్సరాలు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్తగా, ఓ కాలేజీలో లెక్చరర్ గా  పనిచేస్తున్నారు. కనకదుర్గ వయసు 42 సంవత్సాలు. కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో ఆమె పనిచేస్తున్నారు.