టెస్టు క్రికెట్ చరిత్రలోనే భారీ ఓటమి

టెస్టు క్రికెట్ చరిత్రలోనే భారీ ఓటమి

ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో ఏడంటే ఏడే పరుగులు. మొత్తం ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఈ చెత్త రికార్డు హారిస్ షీల్డ్  ట్రోఫీలో నమోదయింది. చిల్డ్రన్ వెల్ఫేర్ స్కూల్ జట్టు ఈ రికార్డు సృష్టించింది.  పదిమంది బ్యాట్స్ మెన్‌లో ఒక్కరంటే ఒక్కరు పరుగుల ఖాతా తెరవలేదు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగా డకౌట్ అయి పెవిలియన్‌కు చేరారు. బౌలర్లు ఇచ్చిన ఏడు ఎక్స్‌ట్రాలే పరుగుల రూపంలో వచ్చాయి. ఒక్క పరుగు కూడా చేయకుండా బ్యాట్స్ మెన్ ఔటయ్యారని మ్యాచ్ జరిగిన ఆజాద్ మైదాన్‌లోని న్యూ ఎరా గ్రౌండ్‌లో   ఏదో లోపముందనుకుంటే పొరపాటే. ఎందుకంటే అదే మైదానంలో అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు కేవలం నాలుగంటే నాలుగు వికెట్లు కోల్పోయి 761 పరుగులు చేసింది. మీట్ మయేకర్ ఒక్కడే 338 పరుగులు చేశాడు. ఇలా ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ విజృంభించిన చోట వెల్ఫేర్ స్కూల్ జట్టు 761 పరుగుల రికార్డుస్థాయి ఓటమిని మూటగట్టుకుంది.