షాకింగ్: మంత్రులంతా రాజీనామా...!

షాకింగ్: మంత్రులంతా రాజీనామా...!

కర్ణాటక రాజకీయాలు మరింత రసకందాయంగా మారాయి.. ఓవైపు కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంటే.. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన నేతలతో కమల దళంలో కలవరం మొదలైంది.. అవసరమైతే రివర్స్‌ ఆపరేషన్‌కు వెనుకాడేది లేదని కాంగ్రెస్ నేతలు ప్రకటించడంతో బయటి ఎమ్మెల్యేల సంగతి తర్వాత.. కానీ, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలోపడిపోయింది బీజేపీ. ఇక ఊహించని విధంగా సంకీర్ణ సర్కార్‌లోని మంత్రులంతా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి కుమారస్వామికి అందజేశారు. ఆయన కాసేపట్లో మంత్రుల రాజీనామా లేఖలతో రాజ్‌భవన్ వెళ్లనున్నారు. దీంతో కర్ణాటక రాజకీయం క్షణం క్షణం ఉత్కంఠగా మారుతోంది.. తమ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరతారా? లేక, మళ్లీ కేబినెట్ విస్తరణకు అవకాశం ఇవ్వాలని విన్నవిస్తారా? అనే చర్చ మొదలైంది. అయితే, ఇప్పుడున్న మంత్రులంతా రాజీనామా చేసి... తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించడానికే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. మరి రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.