ముంబైలో రెండు రోజులు అన్ని బంద్... కరోనా ఎఫెక్ట్ తో కాదు... 

ముంబైలో రెండు రోజులు అన్ని బంద్... కరోనా ఎఫెక్ట్ తో కాదు... 

మహారాష్ట్రను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.  నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 266 కరోనా మరణాలు సంభవించాయి. ఒకవైపు కరోనా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు వర్షాలు కోలుకొని దెబ్బ కొడుతున్నాయి. రాజధాని ముంబై  మహానగరాన్ని ఇప్పుడు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  గత 10 గంటల్లో ముంబై నగరంలో 230 మీమీ వర్షపాతం నమోదైంది.  దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.  

ఈరోజు మధ్యాహ్నం సమయంలో భారీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతో, ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరించింది.  అత్యవసర సేవలు మినహా అన్నింటికీ సెలవులు ప్రకటించింది.  భారీ వర్షాలు కురుస్తుండటంతో అటు అంతర్జాతీయ విమాన సేవలు సైతం నిలిచిపోయాయి.