ఆర్టీసీ సమ్మె...గవర్నర్‌ తమిళిసై కి వినతిపత్రం

ఆర్టీసీ సమ్మె...గవర్నర్‌ తమిళిసై కి వినతిపత్రం


ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్‌ తమిళిసై కి వినతిపత్రం సమర్పించారు విపక్ష పార్టీ నేతలు. ఆర్టీసీ కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చేలా చొరవ చూపాలని గవర్నర్ కోరారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరోవైపు కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. కార్మికులకు న్యాయం జరిగేలా చొరవా చూపిస్తామని గవర్నర్ పేర్కొన్నారని భట్టి తెలిపారు. ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న ప్రభుత్వ వైఖరిలో మార్పులేదన్నారు సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం. కార్మికులకు న్యాయం జరిగేలా అఖిలపక్షం తరుపున గవర్నర్ కి వినతి పత్రం సమర్పించమన్నారు.