సిపిఎల్ 2020 కోసం చేసిన కరోనా పరీక్షలో అందరికి నెగెటివ్...

సిపిఎల్ 2020 కోసం చేసిన కరోనా పరీక్షలో అందరికి నెగెటివ్...

కరేబియన్ ప్రీమియర్ లీగ్(సిపిఎల్) లో పాల్గొనే 162 మంది ఆటగాళ్ళు, అధికారులు మరియు నిర్వాహకులకు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో వారందరికి నెగెటివ్ వచ్చింది. . అయితే వీరందరిని ఇప్పుడు హోటల్‌లో 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, క్రమం తప్పకుండా కరోనా  పరీక్షలు చేయనున్నట్లు సిపిఎల్ తెలిపింది. అందులో ఎవరికైనా కరోనా పాజిటివ్ తేలితే వారిని ఆ హోటల్ నుండి తొలగించి ఒంటరిగా ఉంచుతాము అని తెలిపారు. ప్రతి ఒక్కరినీ ట్రినిడాడ్ మరియు టొబాగోలోకి సురక్షితంగా తీసుకురావడానికి ఇది అందరు చేసిన భారీ ప్రయత్నం అని ఈ టోర్నమెంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ హాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే క్రికెట్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి ఆటగాళ్ళు, కోచ్‌లు మరియు సహాయక సిబ్బంది కరేబియన్‌కు వెళ్లారు. ఈ టోర్నమెంట్ ఆగస్టు 18 నుండి ప్రారంభమవుతుంది, ఫైనల్ సెప్టెంబర్ 10 న జరుగుతుంది. ట్రినిడాడ్‌లోని రెండు వేదికలలో మాత్రమే అన్ని మ్యాచ్లు జరుగుతాయి. ఇంతకముందు లీగ్ లో రన్నరప్‌గా ఉన్న గయానా అమెజాన్ వారియర్స్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది.