కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన మరో ఆటగాడు... 

కరోనా నెగెటివ్ : జట్టులో చేరిన మరో ఆటగాడు... 

కరోనాా పరీక్షలో నెగెటివ్ వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ వచ్చే వారం వెస్టిండీస్‌తో జరిగే మొదటి టె స్టుజట్టులో చేరాడు. అందువల్ల ఇక అతను ఇంగ్లాండ్ జట్టుతో  శిక్షణను ప్రారంభించవచ్చని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) తెలిపింది. అయితే  ఇంతకముందు ఇసిబి కరోనా పరీక్షలు నిర్వహించినప్పుడు అనారోగ్యంతో  బాధపడుతున్న కర్రన్  స్వీయ-నిర్బంధం లో ఉన్నాడు. అయితే ఇప్పుడు కోలుకున్నకర్రన్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో నెగెటివ్ వచ్చింది. దాంతో  అతను రాబోయే 24-48 గంటలలో శిక్షణకు తిరిగి వస్తాడు అని  ఇసిబి తెలిపింది. ఇక జట్టులోకి వచ్చిన  22 ఏళ్ల కర్రన్‌తో పాటు మిగతా టీమ్‌, మరో ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌ ఈ ఆదివారం ఆడనుంది. అయితే జూన్ 3-23 వరకు ఆటగాళ్ళు,,మ్యాచ్ ఆఫీసర్లతో పాటు హోటల్ మరియు సహాయక సిబ్బంది మొత్తం 702 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అందులో వారందరికి కూడా నెగెటి వ్వచ్చిందని ఇసిబి గత వారం తెలిపింది.ఇక ఇంగ్లాండ్-వెస్టిండీస్‌  మొదటి టెస్ట్ మ్యాచ్ జూలై 8 న సౌతాంప్టన్‌లో ప్రేక్షకులు లేకుండా ప్రారంభం కానుంది.