వెంకీ మామకు అంతా రెడీ !

వెంకీ మామకు అంతా రెడీ !

వెంకటేష్, నాగచైతన్యలు కలిసి చేస్తన్న మల్టీస్టారర్ 'వెంకీ మామ'.  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  ఈ ఇందులో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించనుంది.  ముందుగా చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకున్నా ఎందుకో ఆ జోడీ సెట్ కాలేదు.  అందుకే రాశీఖన్నాను తీసుకున్నారు.  రాశీ గతంలో 'మనం' చిత్రంలో కొద్దిసేపు నాగ చైతన్య సరసన మెరిసింది.  ఇకపోతే ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడు.