బ్రెయిన్ ట్యూమర్ విజేత ఆ బాలుడు..

బ్రెయిన్ ట్యూమర్  విజేత ఆ బాలుడు..

ప్రపంచ ఫుడ్ బాల్ మ్యాచ్‌లు  అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా  విపరీతంగా  మ్యాచ్ ల కోసం ఎగబడుతున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ అనే చిన్నారికి కూడా అందరిలాగే పుట్‌బాల్ అంటే మహా పిచ్చి. అయితే... ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. మ్యాచ్ లు చూడలేని పరిస్థితి. ట్యూమర్ తో బాధపడుతున్న బెన్ నడవలేడు. మాట్లడలేడు. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే బర్మింగ్ హామ్‌లోని క్వీస్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చేర్పించారు ఆ చిన్నారి పేరెంట్స్. ఆరు వారాల రేడియో థెరపీ విజయవంతగా పూర్తి చేసుకున్నాడు.  డాక్టర్లు ఆ చిన్నారి పట్ల ప్రేమాభిమానులు చూపించారు. దీంతో  బెన్ త్వరగా కోలుకున్నాడు. ఫుట్ బాల్ కప్ గుర్తు చేసుకున్న బెన్ కు... ఆసుపత్రి సిబ్బంది సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ నమూనను బహుకరించారు. దీంతో బెన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు రేడియోథెరపీ చికిత్స అనంతరం బెన్ అందుకున్న మొట్టమొదటి కానుక వరల్డ్ కప్ నమూనా కావడంతో సంతోషానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.